తిరుపతి: తిరుమలలోని కౌస్తుభం అతిధి గృహానికి సమీపంలో ఓ జీపు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు అశ్విని ఆసుపత్రికి తరలించారు. జీపు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. జీపు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
