విశాఖ: విశాఖ జిల్లాలోని తాళ్లపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్.. నడిచి వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. వారు పొలం పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు తాళ్లపాలెం గ్రామానికి చెందిన కరణం సోమినాయుడు (55), కరణం పైడితల్లి( 50) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
