నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం కేతి గుంట మలుపు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
