Breaking News
Home / States / Andhra Pradesh / రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

వైఎస్సార్‌ జిల్లా: రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవాను లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా… మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. పొద్దుటూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాయచోటికి చెందిన అర్షద్‌, హజీరా, చిత్తూరు జిల్లాకు చెందిన హరుణ్‌ బాషా, అఫిరాలు మృత్యువాతపడ్డారు. హజీరా, అర్షద్‌లు రాయచోటికి చెందిన స్టార్‌ పైపుల షాపు యజమాని కూతురు, అల్లుడు అని సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *