చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై లారీని ఢీ కొట్టబోయిన కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన నిల్చున్న వారి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ సమయంలో రోడ్డుపై ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడ్డ వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటన అక్కడ వున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
source by news18