Breaking News
Home / States / మర్పల్లిలో రోడ్డు ప్రమాదం…వ్యక్తి మృతి…

మర్పల్లిలో రోడ్డు ప్రమాదం…వ్యక్తి మృతి…

మర్పల్లి: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా జార్‌క్లా గ్రామానికి చెందిన అంజుమ్‌ఖాన్‌ (32) నర్సాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద మూడేళ్లుగా జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల బక్రీద్‌ పండగ కోసం ఇంటి వెళ్లి రెండు నెలల క్రితం తిరిగి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌లో నమాజ్‌ చేసుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా కంకర మిషన్‌ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న 11 కేవీ విద్యుత్‌ స్తంభానికి ఢీకొని ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ఘటనలో అంజుమ్‌ ఖాన్‌ తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. మర్పల్లి జెడ్పీటీసీ పబ్బె మధుకర్, స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు 6గురు సంతానం ఉన్నట్లు తెలిసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *