Breaking News
Home / States / Andhra Pradesh / ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం..

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం..

ప్రకాశం: కొనకనమెట్ల మండలం, కొత్తపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, తుఫాను వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కర్ణాటకకు చెందిన ఉద్ధట్టి హంసమ్మ, చెట్లపల్లి సుగుణమ్మ, బళ్ళారి సునీత, సిద్దంపల్లి ఇమాంతరెడ్డిగా గుర్తించారు. శ్రీశైలం నుండి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్ పరారయ్యాడు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *