Breaking News
Home / News / లాక్‌డౌన్ సడలింపులతో రోడ్డు ప్రమాదాలు..

లాక్‌డౌన్ సడలింపులతో రోడ్డు ప్రమాదాలు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపులు చేయడంతో వాహనాదారులు అత్యధికంగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్రవాహనానికి సైడ్‌ అద్దాలు తప్పనిసరి చేశారు. అలాగే ద్విచక్రవాహనంపై ఇద్దరికీ హెల్మెట్‌  ఉండాలని తెలిపారు. లెర్నింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు వాహనానికి ముందు వెనకాల ఎల్‌ బోర్డు తప్పనిసరి‌గా పెట్టుకోవాలని సూచించారు. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం తనిఖీలు, జరిమానాకు పోలీసులు సిద్ధమయ్యారు.

Check Also

పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఆరు కరోనా కేసులు…

Share this on WhatsAppఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *