Breaking News
Home / States / రోడ్డు ప్రైవేటీకరణ ప్రారంభం….

రోడ్డు ప్రైవేటీకరణ ప్రారంభం….

హైదరాబాద్‌ : నగరంలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు త్వరలో ప్రారంభం కానునట్లు జీహెజ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ నెల 10నుంచి 709 కి. మీ మేరకు పనులు మొదలు పెడతామన్నారు. వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను జనవరిలో ప్రారంభిస్తామన్నారు. ఫిబ్రవరి వరకు లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందించే విధంగా పనులు చేపడుతున్నట్లు, దాదాపు తొమ్మిది వేల వరకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్‌ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమాచారం ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఇక ఓపెన్‌ స్పేస్‌లలో పార్క్‌లను అభివృద్ధి చేస్తామని, మీడియన్‌.. జంక్షన్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి జోన్‌లో స్కైవాక్‌ నిర్మించాలన్నారు. రోడ్డు మరమత్తు పనులు పూర్తి అవుతున్నాయని, చెత్త సేకరణ కోసం 60 ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్ల వెల్లడించారు. మూడు నెలల్లో 284 పనులకు అనుమతులిచ్చామని, వీడీసీసీ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

Check Also

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్…

Share this on WhatsAppవిశాఖ: విశాఖ జిల్లా గాజువాకలో చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఉదయం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *