Breaking News
Home / States / Andhra Pradesh / రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత…

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత…

తూర్పు గోదావరి: అధిక శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల కారణంగానే జరుగుతాయని, ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉంటే నివారించడం సాధ్యమవుతుందని మలికిపురం ఎస్‌ఐ కె.రామారావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మలికిపురం మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మలికిపురం ఎస్‌ఐ మాట్లాడుతూ.. విద్యార్థులు రహదారులపై వెళుతున్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రమాదాల నివారణకు పోలీస్‌ యంత్రాంగం చట్టం పరిధిలో పనిచేస్తూ పెట్టే ఆంక్షలకు ప్రజలు ఇబ్బంది పడకుండా సహకరించాలన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడుపుతుండటం వల్ల ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల వల్ల వాహనాలు నడుపుతున్న వ్యక్తులే కాకుండా ఎదరుగా వస్తున్న వారు కూడా బలి కావలసి వస్తుందని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *