Breaking News
Home / National / భోజనం సర్వ్ చేస్తున్న రోబోలు…

భోజనం సర్వ్ చేస్తున్న రోబోలు…

ఒడిశా: రానున్న రోజుల్లో రోబో యుగం రాబోతోంది. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ రోబోలు అన్ని పనులు చేసేస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో మూవీలో చూపించినట్లుగా.. మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి రోబో అన్ని పనులు చేయగలుగుతుంది. మాట్లాడుతుంది. పనిచేస్తుంది. డ్యాన్స్ కూడా చేస్తుంది. కోపం వస్తే కొట్టేస్తుంది. మనం ఏం చెబితే అదే చేస్తుంది. తాజాగా ఒడిశాలోని ఓ హోటల్‌లో రోబోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న రోబో చెఫ్ హోటల్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది. ఆ రెస్టారెంట్‌లో రెండు రోబోలు కస్టమర్లకు భోజనం సర్వ్ చేస్తున్నాయి. ఈ రోబోలు భారత్‌లోనే తయారయ్యాయి. రోబోలకు చంపా, చమేలి అనే పేర్లు పెట్టినట్లు హోటల్ ఓనర్ జీత్ తెలిపారు. ఈశాన్య భారతంలో రోబోలతో సర్వ్ చేస్తున్న తొలి హోటల్ తమదే అని అతను చెప్పాడు. హోటల్‌కు వస్తున్న కస్టమర్లకు రోబోలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ రోబోలు ఒడిశా భాషలో మాట్లాడతాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *