Breaking News
Home / Sports / ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుని నాలుగోసారి ఛాంపియన్స్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ. నాలుగోసారి టైటిల్‌ని సొంతం చేసుకున్న రోహిత్ మరో అరుదైన ఘనతని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2009లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఐపీఎల్‌లో రోహిత్ శర్మ.. డెక్కెన్ ఛార్జస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ ఫైనల్‌లో డెక్కెన్ ఛార్జస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ.. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్టులో సభ్యుడిగా నిలిచాడు.

Check Also

ఛాలెంజ్ విరిసిన యువరాజ్.. గెలిచిన ధవన్

Share this on WhatsAppన్యూఢిల్లీ: చేతి వేలి గాయం కారణంగా ప్రపంచకప్ టోర్నీ నుంచి బయటకొచ్చిన శిఖర్ ధవన్.. చాలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *