Breaking News
Home / States / Andhra Pradesh / చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ….

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ….

విశాఖపట్నం: టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టెస్టులో రోహిత్‌కిది రెండో సెంచరీ కావడం విశేషం. కేవలం 133 బంతుల్లో 9ఫోర్లు, 4 సిక్సర్లతో 100 మార్క్‌ చేరుకున్నాడు. ఓవరాల్‌గా టెస్టులో హిట్‌మ్యాన్‌కు ఇది ఐదో సెంచరీ. టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు. రోహిత్‌ కెరీర్‌లో వైజాగ్‌ టెస్టు ప్రత్యేకంగా నిలువనుంది. సుధీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా సంచలన ప్రదర్శన చేసి కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీ విరామం అనంతరం స్వల్ప వ్యవధిలోనే పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 54 ఓవర్లు ముగిసేసిరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రోహిత్‌(105), జడేజా(8) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని టీమ్‌ ఇండియా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *