వరంగల్: ఆదివారం ఖాజీపేట్ రైల్వే స్టేషన్ బుకింగ్ కార్యాలయంలో పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కంప్యూటర్ కీ బోర్డులు మాత్రం దెబ్బతినగా వెంటనే వాటిని తొలగించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టికెట్లు అందజేశారు.
