Breaking News
Home / Film News / ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు ఆలియా భట్ బై బై చెప్పినట్లేనా..

ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు ఆలియా భట్ బై బై చెప్పినట్లేనా..

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌ టైటిల్‌తో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. రాజమౌళి తెలుగు టాప్ స్టార్స్ తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి ఆలియా భట్ నటించనుంది. పూణే షెడ్యూల్‌లో ఆలియా ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ కానుందని చిత్రబృంద చెప్పుకొచ్చింది. అయితే ఏవో కారణాలతో పూణే షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. దీనికి తోడు కరోనా లాక డౌన్ కూడా తోడవ్వడంతో ఆలియా ఇప్పటి వరకు టీంతో జాయిన్ కాలేదు. కాగా బాలీవుడ్ బిజీ నటీమణులలో ఆలియా భట్ ఒకరు. ఆమె చేతిలో ప్రస్తుతం అదిరిపోయే ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె RRR సినిమాతో పాటు, గంగూబాయ్, సడక్ 2, బ్రహ్మస్త్రలో నటిస్తోంది. దీంతో ప్రతి ప్రాజెక్ట్‌కి పక్కా ప్లానింగ్‌తో డేట్స్ ఇచ్చిన ఆలియా భట్‌కి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టతరంగా మారిందట. కరోనా కారణంగా వాయిదా పడ్డ పూణే షెడ్యూల్ ఎప్పుడు మొదలుకానుందో తెలియని పరిస్థితి. దీంతో ఆలియా భట్ అందుబాటులో ఉంటుందా అనేది సందేహంగా ఉందట.

Check Also

బుల్లితెర నటుడికి కరోనా పాజిటివ్..! ఆందోళనలో టీవీ యాక్టర్స్.!

Share this on WhatsAppతెలంగాణలో కరోనా వైరస్ భారీగా విజృంభిస్తుంది. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *