Breaking News
Home / States / నల్గొండ జిల్లాలో రూ.10.80 లక్షలు పట్టివేత….

నల్గొండ జిల్లాలో రూ.10.80 లక్షలు పట్టివేత….

నల్గొండ: కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద సోమవారం రాత్రి ఎస్‌ఎస్‌టీ (స్ట్రయికింగ్ సర్వీసులైన్ టీం) సభ్యుల తనిఖీల్లో రూ.10 లక్షల 80 వేల నగదు పట్టుబడింది.  సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఎస్‌టీ సభ్యులు ప్రత్యేక వాహన తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సూర్యాపేట వైపు వెళ్లే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న కారును తనిఖీ చేయగా అందులో ఉన్న వ్యక్తి  వద్ద రూ.10 లక్షల 80 వేల నగదు లభ్యమైంది. ఆ నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు అతడి వద్ద లేకపోవడంతో ఎస్‌ఎస్‌టీ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *