ఢిల్లీ: ఢిల్లీకి చెందిన స్టార్టప్ ప్లేఫిట్.. నూతనంగా ప్లేఫిట్ 21, 53 పేరిట రెండు నూతన స్మార్ట్బ్యాండ్లను విడుదల చేసింది. ప్లేఫిట్ 21 ఫిట్నెస్ బ్యాండ్‌లో 0.96 ఇంచుల కలర్ డిస్ప్లే, బ్లూటూత్ 4.2, హార్ట్‌రేట్ సెన్సార్, పెడో మీటర్, స్లీప్ మానిటరింగ్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 7 నుంచి 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ప్లేఫిట్ 53 ఫిట్నెస్ బ్యాండ్‌లోనూ దాదాపుగా ముందు చెప్పిన ఫిట్నెస్ బ్యాండ్‌లోని ఫీచర్లనే అందిస్తున్నారు. కాకపోతే ప్లేఫిట్ 53 బ్యాండ్‌లో అదనంగా గెస్చర్ సపోర్ట్, క్లిక్ పిక్చర్స్, ట్రెయినింగ్ మోడ్ తదితర ఫీచర్లను అదనంగా అందిస్తున్నారు. ఇక ప్లేఫిట్ 21 బ్యాండ్ ధర రూ.1299 ఉండగా, ప్లేఫిట్ 53 బ్యాండ్ ధర రూ.1999గా ఉంది. వీటిని అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నారు.
