రాయదుర్గం: జాతీయ రహదారిలో రోడ్డుపైకి వ్యర్థనీటిని వదిలినందుకు రూ. 2 లక్షల జరిమానాను జీహెచ్ఎంసీ అధికారులు విధించారు. దాబా కూడలి నుంచి వెళ్లే రోడ్డులో పక్వాన్ హోటల్ ఎదురుగా నందన వెంచర్స్ సెల్లార్ నిర్మాణం చేస్తున్నారు. సెల్లార్లో పేరుకుపోయిన వ్యర్థ నీటిని పైప్లైన్ ద్వారా రోడ్డుపైకి వదిలేశారు. అసలే రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తుండడంతో రోడ్డంతా ఇరుకుగా మారింది. ఈనేపథ్యంలో వ్యర్థనీటిని రోడ్డుపైకి వదిలినందుకు ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
