Breaking News
Home / States / సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం..ఒకరు మృతి

సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం..ఒకరు మృతి

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు విఫలం కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను తాకుతూ జనాలపైకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న ఆటో , కార్లను ఢికొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Check Also

వైఎస్‌ జగన్-కేటీఆర్‌ భేటీపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

Share this on WhatsAppఅమరావతి: లాంగ్ గ్యాప్ తర్వాత.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *