Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / 18 నుంచి ఆర్టీసీ బస్సులు..!

18 నుంచి ఆర్టీసీ బస్సులు..!

బ‌స్సుల‌ను అంత‌ర్ జిల్లా స‌ర్వీస్ లుగానే న‌డ‌పాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో మాత్రమే బస్సులు తిప్పనున్నారు. ఇక, బ‌స్సుల్లో 50 శాతం సీట్లలో మాత్రమే ప్రయాణీకుల‌ను అనుమ‌తించనున్నారు.. సిటీ బ‌స్సుల‌కు సైతం ఇదే నిబంధ‌న వ‌ర్తింప జేయాలనేది ఆర్టీసీ ప్లాన్‌గా తెలుస్తోంది. అంతేకాదు.. కొద్దిరోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించారు.. బస్సుల్లో ప్రయాణికుల మధ్య తిరుగుతూ కండక్టర్లు బ‌స్‌టిక్కెట్లు ఇస్తే కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని భావించిన ఆర్టీసీ.. ప్రయాణికులకు ఆన్‌లైన్‌లో, కరెంట్‌ రిజర్వేషన్‌, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొనే విధంగా అడుగులు వేస్తోంది. ఇక, నాన్‌ ఏసీ బస్సుల విషయానికి వస్తే 150 కిలోమీటర్లకు పైన దూరం వెళ్లే బస్సులకు 5 స్టాప్‌లు మాత్రమే ఉండాలని.. అది కూడా ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి అంటున్నారు. ఇక 150 కిలోమీటర్ల లోపు బస్సు సర్వీసులు అయితే ఆర్టీసీ నిర్దేశించిన కౌంటర్లలో టిక్కెట్లు తీసుకోవాలి. నాన్ స్టాప్ బస్సులకు కూడా ఇక ఆన్‌లైన్ రిజర్వేషన్లు ఉంటాయి. పల్లె వెలుగు బస్సుల‌కు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తోంది ఆర్టీసీ.. ప్రయాణికులు బస్టాండ్‌లు, ఆర్టీసీ సిబ్బంది, బుకింగ్ ఏజెంట్ల దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. బస్టాండుల్లో టిక్కెట్ల కోసం గ్రౌండ్ బుకింగ్ సాప్ట్‌వేర్‌తో టిమ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తారు. సిటీ బస్సుల్లో సైతం కండక్టర్లు లేకుండా కొన్ని స్టాపుల్లో టిక్కెట్లు తీసుకోవాలి. అంతేకాదు.. బస్సు డోర్లపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసే పనిలో పడిపోయారు ఆర్టీసీ అధికారులు.

Check Also

సంతృప్త స్థాయిలో.. అన్ని పథకాలు

Share this on WhatsAppఅధికారులతో సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎవరైనా మిగిలిపోతే అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *