Breaking News
Home / States / Telangana / ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస భేటీ

ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస భేటీ

హైదరాబాద్‌: విద్యానగర్‌లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో విపక్ష పార్టీ నేతలతో తెలంగాణ ఆర్టీసీ ఐకాస సభ్యులు సమావేశమయ్యారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్లు రాజిరెడ్డి, సుధ, తెదేపా నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, వామపక్షనేత పోటు రంగారావు తదితరులు హాజరయ్యారు. ఆర్టీసీ ఐకాస భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగంలో చేరేందుకు ఐకాస ప్రతిపాదించినా.. ప్రభుత్వం స్పందించకపోవడంపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. కేంద్రమంత్రులను కలిసే ఆలోచనపైనా చర్చిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కేంద్రమంత్రుల అనుమతులు కోరినట్లు తెలుస్తోంది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *