Breaking News
Home / States / నేటి నుంచి ఉధృతం కానున్న ఆర్టీసీ సమ్మె

నేటి నుంచి ఉధృతం కానున్న ఆర్టీసీ సమ్మె

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె బుధవారం నుంచి మరింత ఉధృతం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పది గంటలకు ఆర్టీసీ జేఏసీ నాయకులు సమావేశం కానున్నారు. ఆ వెంటనే… పదకొండు గంటలకు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. మరోవైపు బుధవారమే అన్ని జిల్లాల్లో కూడా రాజకీయ నాయకులతో ఆర్టీసీ ఉద్యోగులు సమావేశం కానున్నారు. ఇతరత్రా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు… ఏకంగా ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమంటున్నట్లు వినవస్తోంది. ఇక ‘మాది మరో తెలంగాణ అస్తిత్వ పోరాటం. ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నాం’ అని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *