Breaking News
Home / States / ఆర్టీసీ సమ్మె… సకల జనుల సమ్మెగా మారుతుంది…

ఆర్టీసీ సమ్మె… సకల జనుల సమ్మెగా మారుతుంది…

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె, భవిష్యత్‌ కార్యాచరణపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన అఖిలపక్షాల సమావేశం ముగిసింది. తెలంగాణ బంద్‌పై రేపు మధ్యాహ్నం ప్రకటన చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్లే ఆర్టీసీ సమ్మె అనివార్యమైందని.. తక్షణమే ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర జరుగుతోందని.. దీన్ని అన్ని పార్టీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరో సకలజనుల సమ్మెకు సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఆర్టీసీ సమ్మె..సకల జనుల సమ్మెగా మారుతుందని కోదండరాం హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలన్నారు. సమ్మెపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని అఖిలపక్షాల నేతలు నిర్ణయించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *