హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతోన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారంతో 11 వ రోజుకు చేరింది. అన్ని జిల్లాల్లోనూ డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు రాస్తారోకోలు చేపట్టారు. బస్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రంలోపు చర్చలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో వైపు కరీంనగర్ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ తో పాటు నలుగురు మంత్రులకు ఆర్టీసీ జేఏసీ పిండ ప్రదానం చేసి నిరసన తెలిపారు.
