హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఇవాళ్టితో కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు సమస్యలు, పలు డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాలు, ర్యాలీలు చేపట్టనున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు నిరసనలు తెలపనున్నారు.
