Breaking News
Home / National / కోచ్‌ అవతారమెత్తనున్న సచిన్‌

కోచ్‌ అవతారమెత్తనున్న సచిన్‌

కార్చిచ్చు బాధితుల సహాయార్థం కోసం..

సిడ్నీ: కార్చిచ్చు బాధితుల సహాయార్థం భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ కోచ్‌గా అవతారమెత్తనున్నాడు. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ధన, ప్రాణ నష్టాన్ని కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాంటింగ్ Xఈ, వార్న్‌ Xఈ జట్లతో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) బాధితుల సహాయం కోసం బుష్‌ఫైర్‌ క్రికెట్‌ బాష్‌ మ్యాచ్‌ను నిర్వహించనుంది. రికీ పాంటింగ్‌ జట్టుకు సచిన్‌, షేన్‌ వార్న్‌ జట్టుకు వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్ వాల్ష్‌ కోచ్‌లుగా వ్యవహరించనున్నారని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు సీఈవో కెవిన్‌ రాబర్ట్స్‌ తెలిపారు.

”సచిన్, వాల్ష్‌ను ఆస్ట్రేలియాకు స్వాగతిస్తున్నందుకు ఎంతో గౌరవంగా ఉంది. వారిద్దరు ఆసీస్‌లో ఆటగాళ్లగా ఎన్నో విజయాలు సాధించారు. ప్రత్యేకమైన రోజున వారిని కోచ్‌లుగా చూడటానికి ఎంతో ఎదురుచూస్తున్నాం. వారిద్దరు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించారు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధిస్తే, వాల్ష్‌ టెస్టుల్లో 500 వికెట్లు పైగా పడగొట్టాడు. ‘బిగ్‌ అప్పీల్‌’ కోసం ఆస్ట్రేలియా క్రికెట్‌ కుటుంబం మొత్తం వస్తుంది. ప్రజలంతా దీనిలో పాల్గొంటారని ఆశిస్తున్నాం” అని కెవిన్‌ అన్నారు.

ఈ ఛారిటి మ్యాచ్‌ ఫిబ్రవరి 8న జరగనుంది. అదే రోజున జరగనున్న బిగ్‌బాష్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఇది కర్టెన్‌ రైజర్‌ కానుంది. వేదికను ఇంకా ఖరారు చేయలేదు. అయితే అదే రోజు భారత్, ఆసీస్‌ మహిళా జట్లు టీ20 మ్యాచ్ కూడా ఆడనున్నాయి. ఛారిటి మ్యాచ్‌లో పాంటింగ్, వార్న్‌తో పాటు జస్టిన్‌ లాంగర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌, బ్రెట్‌ లీ, షేన్‌ వాట్సన్‌, అలెక్స్‌ బ్లాక్‌వెల్, మైకేల్ క్లార్క్‌ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. స్టీవ్‌ వా, మెల్ జోన్స్‌ కూడా హాజరుకానున్నారు. వచ్చే రెండు వారాల్లో ‘బిగ్‌ అప్పీల్’లో పాల్గొననున్న ఇతర ఆటగాళ్ల వివరాలు, దీనికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుస్తాయి. దీని ద్వారా వచ్చే డబ్బు మొత్తం ఆస్ట్రేలియా రెడ్‌ క్రాస్ డిజాస్టర్‌ రిలీఫ్‌& రికవరీ ఫండ్‌కు చేరుతుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *