Breaking News
Home / States / Andhra Pradesh / ప్రజలకు రక్షణ కల్పించడంలో…

ప్రజలకు రక్షణ కల్పించడంలో…

గుడివాడ: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ పోలీసుశాఖ బాధ్యతాయుతమైన సేవలను అందిస్తోందని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. మంత్రి నాని మాట్లాడుతూ… శాంతిభద్రతలు, ప్రజలకు రక్షణ కల్పించడంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ బాధ్యతలను నిర్వహించేది పోలీసులేనన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాత్రీపగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తారన్నారు. పోలీసుల పట్ల ప్రజల్లో ఉండే భయాన్ని పోగొట్టేందుకు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. తొలుత ఆయుధాల ప్రదర్శనను మంత్రి కొడాలి నాని తిలకించారు. ఆయుధాల పనితీరు, వినియోగించే సమయంలో తమను తాము రక్షించుకునే పద్ధతులను మంత్రికి పోలీసు అధికారులు వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *