Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీ పాలనపై 6నెలల తర్వాతనే స్పందిస్తాం: కన్నా

వైసీపీ పాలనపై 6నెలల తర్వాతనే స్పందిస్తాం: కన్నా

విజయనగరం జిల్లా: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆరు నెలల తర్వాత స్పందిస్తామని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్యినారాయణ అన్నారు. గురువారం విజయనగరం జిల్లాలో బీజేపీ సభ్యత్వ సంఘటన్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొన్నఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని నమ్మి బీజేపీ వైపు టీడీపీ నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా వలస వస్తున్నారని అన్నారు. గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే పార్టీ తరపున స్పందిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వలనే గిరిజన విశ్వవిద్యాలయం ఆలస్యం అవుతోందన్నారు. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ అంతర్గత విభేదాలే ప్రస్తుత సంక్షోబానికి కారణమని బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హరిబాబు, మాజీ ఎం.ఎల్.ఎ విష్ణు కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *