Breaking News
Home / States / Andhra Pradesh / సాగర్‌ రెండు గేట్ల నుంచి నీటి విడుదల

సాగర్‌ రెండు గేట్ల నుంచి నీటి విడుదల

జూరాలలో ఆరు గేట్ల ద్వారా..
నాగార్జునసాగర్‌/ధరూర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు రెండు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి 71,436 క్యూసెక్కుల వరద వస్తుండటంతో బుధవారం రెండు గేట్లను ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 71,436 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి 71,436 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. అధికారులు బుధవారం ఆరు గేట్ల ద్వారా 40,450 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జెన్‌కో జలవిద్యుత్‌ కేంద్రం వద్ద ఒక్క యూనిట్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తుండగా మరో 4 యూనిట్లలో లోపం తలెత్తడంతో న అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి కోసం 7600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మరో 4 గేట్లను మూసివేశారు. దీంతో ఇన్‌ఫ్లోలు పెరగడంతో మళ్లీ జూరాల నుంచి 6 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *