Breaking News
Home / States / నేటితో ముగిసిన సహస్ర చండీ యాగం…

నేటితో ముగిసిన సహస్ర చండీ యాగం…

ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న సహస్త్ర చండీ యాగం ముగిసింది. చివరి రోజు అయిన గురువారం నిర్వహించిన యాగానికి మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ కవిత హాజరయ్యారు. చినజియార్ స్వామి సహా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, ప్రజా ప్రతినిధులు యాగంలో పాల్గొన్నారు. పలువురు నేతలు, భక్తులు పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శ్రేయస్సు కోసం సహస్త్ర చండీ యాగం చేశామన్నారు. ఈ యాగంలో సుమారు 230 మంది రుత్వికుల సమక్షంలో శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు పవిత్రంగా ఈ యాగం జరిగిందన్నారు. యాగశాల ఏర్పాటు చేస్తున్న సమయంలో అనేకసార్లు వర్షం కురిసిందని, ఈ వర్షాలతో యాగం వాయిదా వేద్దామని అనుకున్నామని, అయితే తన సహచరులు వాయిదా వేయవద్దని యాగం జరపాలని సూచించారు. దాంతో యాగం చేసినట్లు శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *