Breaking News
Home / Film News / సాయిధరమ్‌ తాజా చిత్ర పోస్టర్‌ విడుదల…

సాయిధరమ్‌ తాజా చిత్ర పోస్టర్‌ విడుదల…

హైదరాబాద్‌: ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అని అంటున్నారు టాలీవుడ్‌ యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన కథనాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. నభా నటేష్‌ కథానాయిక. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించారు. నవంబర్‌ నుంచి రెగ్యూలర్‌గా షూటింగ్‌ జరగనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి సంబంధించిన టైటిట్‌ పోస్టర్‌ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ఈ రోజు విడుదల చేసింది.

‘చిత్రలహరి’ హిట్‌ తర్వాత సాయిధరమ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తుండగా రాశీఖన్నా కథానాయిక. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రిలో జరిగింది. ‘సుప్రీమ్‌’ తర్వాత సాయి-రాశీ జంటగా నటిస్తున్న చిత్రమిది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *