Breaking News
Home / Film News / అభిమానులను అలరిస్తున్న సైఫ్ న్యూ లుక్….

అభిమానులను అలరిస్తున్న సైఫ్ న్యూ లుక్….

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తన కొత్త సినిమా ‘లాల్ కెప్టెన్’లో విభిన్నమైన గెటప్‌లతో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సైఫ్ నాగ సాధువుగా కనిపించనున్నాడు. సైఫ్ తొలిసారిగా ఇటువంటి లుక్‌లో కనిపించనున్నాడు. దర్శన్ యెవాలేకర్ హీరో సైఫ్‌కు నాగ సాధువు లుక్‌ను తీసుకువచ్చారు. ఇంతకుముందు దర్శన్ పద్మావత్ సినిమాలో రణవీర్ సింగ్‌కు ఖిల్జీ లుక్ తీసుకువచ్చారు. ఈ లుక్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ సైఫ్‌కు ఈ లుక్ తీసుకువచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందన్నారు. నాగ సాధువులు సామాజిక జీవితంలో అన్ని అంశాలను త్యజిస్తారు. ఎప్పుడూ ఒక కర్ర పట్టుకుని కనిపిస్తుంటారు. పరమేశ్వరుని ప్రేరణ అనుసారం ప్రవర్తిస్తుంటారు. తమ గురించి తాము ఆలోచించుకోరు. జాటాధారిగా ఉంటారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని సైఫ్‌కు నాగ సాధువు లుక్ తీసుకువచ్చానని తెలిపారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *