Breaking News
Home / Film News / ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ మరో చిత్రం…

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ మరో చిత్రం…

ఫిల్మ్ న్యూస్: ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా దర్శకుడిగా మారి వరుస సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో సల్మాన్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌లు రూపొందిస్తున్నాడు. ఇప్పటికే సల్మాన్ – ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చిన వాంటెడ్ చిత్రం మంచి విజయం సాధించడంతో రీసెంట్‌గా దబాంగ్ 3 చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కట్ చేస్తే ప్రభుదేవా- సల్మాన్ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రానికి రాధే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ 4 నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. 2017లో వచ్చిన కొరియన్ చిత్రం ది ఔట్ లాస్‌కి రీమేక్‌గా రాధే మూవీ తెరకెక్కనున్నట్టు సమాచారం.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *