Breaking News
Home / Film News / త‌న ఫ్యాన్‌ని పిలిచి మ‌రీ సెల్ఫీ దిగిన హీరో….

త‌న ఫ్యాన్‌ని పిలిచి మ‌రీ సెల్ఫీ దిగిన హీరో….

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ త్వ‌ర‌లో ద‌బాంగ్ 3 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చుల్‌బుల్ పాండే అనే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌తో అల‌రించ‌నున్నాడు. రీసెంట్‌గా చిత్ర ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం ముంబైలో జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేక‌ర్‌తో పాటు చిత్ర బృందం హాజ‌రయ్యారు. దబాంగ్ 3 చిత్ర ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అయితే రీసెంట్‌గా ర‌మేష్ త‌రుణి ఇంట్లో జ‌రుగుతున్న దీపావ‌ళి పార్టీ వేడుక‌కి స‌ల్మాన్ హాజ‌రు కాగా, ఆయ‌నని ఫోటో గ్రాఫ‌ర్స్ త‌మ కెమెరాల‌లో బంధించారు. అయితే ప‌క్క‌నే ఉన్న ఓ ఫ్యాన్ స‌ల్మాన్‌తో సెల్ఫీ దిగేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించింది. ఈ విష‌యం తెలుసుకున్న స‌ల్మాన్ త‌న అభిమానిని పిలిచి మరీ సెల్ఫీ దిగాడు. ఆమెకి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు. అతను ప్ర‌వ‌ర్తించిన తీరు ఎంద‌రో నెటిజ‌న్స్ హృద‌యాల‌ని గెలుచుకుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *