Breaking News
Home / National / రాహుల్ పై సల్మాన్‌ ఖర్షీద్‌ సంచలన వ్యాఖ్యలు…

రాహుల్ పై సల్మాన్‌ ఖర్షీద్‌ సంచలన వ్యాఖ్యలు…

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పరాజయ భారంతో కాంగ్రెస్‌ చీఫ్‌గా రాహుల్‌ గాందీ వైదొలగడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని ఆ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. రాహుల్‌ నిష్క్రమణతో పార్టీలో గ్యాప్‌ నెలకొందని, దీంతో పార్టీ దిక్కుతోచని స్ధితిలో పడిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీ ఈ దశలో ఎందుకు ఉన్నదనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాహుల్‌ను పార్టీ చీఫ్‌గా కొనసాగాలని తాము ఎన్నిరకాలుగా విజ్ఞప్తి చేసినా పదవి నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. పార్టీలో నేడున్న పరిస్థితుల దృష్ట్యా హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం సంక్లిష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంలో పడిందని వ్యాఖ్యానించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *