హైదరాబాద్: జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో వచ్చిన ఆరోపణలపై వాదించేందుకు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హైదరాబాద్ రానున్నారు. ఆ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్ధి రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్పై ఆయన వాదనలు వినిపించనున్నారు. వాదనలు అనంతరం సల్మాన్ ఖుర్షీద్ విలేకరులతో మాట్లాడతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
