Breaking News
Home / Film News / వ‌రల్డ్‌క‌ప్ స‌మ‌యంలోనే స‌మంత సినిమా విడుద‌ల

వ‌రల్డ్‌క‌ప్ స‌మ‌యంలోనే స‌మంత సినిమా విడుద‌ల

పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ రోల్స్‌కు స‌మంత ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంది. `యూట‌ర్న్‌`, `మ‌జిలీ` సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో అందరినీ ఆకట్టుకుందీ అమ్మడు. లేటెస్ట్‌గా స‌మంత న‌టిస్తున్న హీరోయిన్ సెంట్రిక్ మూవీ `ఓ బేబి`. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి ఇది రీమేక్‌. ఈ సినిమాను జూన్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

అదేంటి? జూన్‌లో క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఉంది క‌దా! ఆ స‌మ‌యంలో విడుద‌ల చేస్తే వ‌ర్కవుట్ అవుతుందా? సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారా? అనే సందేహం రావ‌చ్చు. అయితే నిర్మాత సురేష్‌బాబు మాత్రం సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నార‌ట‌. సాధార‌ణంగా నిర్మాత‌లు వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మయంలో త‌మ సినిమాల‌ను విడుద‌ల చేయ‌డానికి వెనుకా ముందు.. ఆలోచిస్తారు కానీ.. ట్రెండ్‌కు భిన్నంగా సురేష్‌బాబు `ఓ బేబి` చిత్రాన్ని వ‌రల్డ్‌క‌ప్ స‌మ‌యంలోనే విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడు.

Check Also

ఆయనంటే అంతిష్టం’’ : ఛార్మి

Share this on WhatsAppనటిగా మంచి గుర్తింపు పొందుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఛార్మి. అయినా సినిమాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *