Breaking News
Home / National / శాంసంగ్ వార్షికోత్సవ సేల్: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు

శాంసంగ్ వార్షికోత్సవ సేల్: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ వార్షికోత్సవ సేల్‌ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, వేరబుల్స్, ఆడియో డివైజ్‌లు, హోంఅప్లయెన్సెస్ వంటివాటిపై ఆఫర్లు ప్రకటించింది. నేడు మొదలైన ఈ సేల్ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. రాయితీలతోపాటు పదిశాతం అదనపు రాయితీలు, క్యాష్‌బ్యాక్, గిఫ్ట్‌వోచర్లు, శాంసంగ్ ఫోన్లపై మార్పిడి రాయితీలు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్9‌ను రూ.29,999కే అందుబాటులో ఉంచింది. గెలాక్సీ నోట్9ను రూ.42,999కి, శాసంగ్ ఫ్రేమ్ టీవీ ధరను రూ.84,999కి కొనుగోలు చేసుకోవచ్చు. గెలాక్సీ వాచ్ 46 ఎంఎం వేరియంట్‌ను రూ.23,990కే అందుబాటులో ఉంచింది.

గెలాక్సీ నోట్ 10‌తోపాటు ప్లస్ వేరియంట్‌పై శాంసంగ్ మార్పిడి రాయితీలు ఆఫర్ చేస్తోంది. గెలాక్సీ ఎం-సిరీస్, గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై పరిమితకాలంపాటు 10 శాతం ధర తగ్గింపును ఆఫర్ చేస్తోంది. వీటితోపాటు స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా 50 శాతం వరకు రాయితీ ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌లపై 20 శాతం వరకు, యూహెచ్‌డీ, హెచ్‌డీ టీవీలపై 49 శాతం వరకు, జేబీఎల్ ఆడియో యాక్సెసరీలపై 61 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. వీటితోపాటు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. అమెజాన్ పే బ్యాలెన్స్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.1500 వరకు నమ్మకమైన క్యాష్‌బ్యాక్ లభిస్తుందని శాంసంగ్ పేర్కొంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *