Breaking News
Home / Lifestyle / Business / కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్‌…

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్‌…

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ శాంసంగ్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్ 12న శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.. 48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 మెగాపిక్సెల్ షూటర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, ప్రిజం క్రష్ వైట్, ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ పింక్, ప్రిజం క్రష్ బ్లూ రంగుల్లో ఫోన్ అందుబాటులోకి రానుంది. 6.5 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లే, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వోల్టేజీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఫోన్ ధర ఎంత ఉంటుందనేది కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *