Breaking News
Home / Lifestyle / Business / హాట్ కేకుల్లా గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లు.. ఉబ్బితబ్బిబ్బవుతున్న శాంసంగ్

హాట్ కేకుల్లా గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లు.. ఉబ్బితబ్బిబ్బవుతున్న శాంసంగ్

న్యూఢిల్లీ: సౌత్ కొరియన్ మొబైల్ కంపెనీ శాంసంగ్ మంగళవారం విడుదల చేసిన గెలాక్సీ ఎం స్మార్ట్‌ఫోన్లు ‘ఎం10’, ‘ఎం20’లకు అనూహ్య స్పందన లభించింది. ఫస్ట్ సేల్‌లోనే రికార్డు స్థాయిలో ఫోన్లు అమ్ముడుపోయాయి. లక్షలాదిమంది ఎం10, ఎ20 ఫోన్లను సొంతం చేసుకునేందుకు లక్షలాదిమంది వినియోగదారులు అమెజాన్, శాంసంగ్ వెబ్‌సైట్లకు పోటెత్తారు. దీంతో క్షణాల్లోనే ఫోన్లు అమ్ముడుపోయాయి. శాంసంగ్‌పై ప్రేమాభిమానులు కురిపించి, తమకు మద్దతు తెలిపినందుకు శాంసంగ్ కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఎన్ని ఫోన్లు అమ్ముడుపోయాయి, సేల్ ఎంతకాలం కొనసాగుతుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లలో ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, అతి పెద్ద బ్యాటరీ, 3 రెట్లు వేగవంతమైన చార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. గెలాక్సీ ‘ఎం 20’ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉపయోగించగా, ‘ఎం10’లో 3,400 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.

గెలాక్సీ ఎం10లోని 2జీబీ ర్యామ్/16 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,990 కాగా, 3జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ ధర రూ.8,990. గెలాక్సీ ఎం20 లోని 3జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,990 కాగా, 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.12,990. కాగా, గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్ల తర్వాతి సేల్ ఈ నెల 7న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

 

Check Also

పసిడికి కళ

Share this on WhatsAppమళ్లీ మదుపర్లను ఆకర్షిస్తున్న బంగారం అంతర్జాతీయ పరిణామాలే కారణం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *