Breaking News
Home / National / శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

న్యూఢిల్లీ: తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ శాంసంగ్ మరో ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై భారీగా తగ్గిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఏ7, శాంసంగ్ గెలాక్సీ ఏ9 ఫోన్లపై రూ. 5 వేల వరకు తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఏ7 ఫోన్ ప్రారంభ ధర రూ. 18,990, శాంసంగ్ గెలాక్సీ ఏ9 ఫోన్ రూ. 33,990 అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. శాంసంగ్ ఏ7 ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టినప్పటి ధర రూ. 23,990, శాంసంగ్ గెలాక్సీ ఏ9 రూ. 36,990 ఉండేది.

Check Also

జైలు గోడలెక్కి కిందికి దూకుతామంటూ ఖైదీల హల్‌చల్

Share this on WhatsAppతమిళనాడు: మదురై సెంట్రల్ జైలు ఖైదీలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *