Breaking News
Home / States / Andhra Pradesh / గరుడసేవ సందర్భంగా తిరుమలలో ఆంక్షలు…

గరుడసేవ సందర్భంగా తిరుమలలో ఆంక్షలు…

తిరుమల: తిరుమలలో గరుడసేవ సందర్భంగా వాహన మండపం వద్ద ఆంక్షలు విధించారు. గరుడసేవ ప్రారంభ సమయంలో సర్కార్ హారతికి ఆలయ పెద్ద, చిన్న జీయర్లతో పాటు చైర్మన్‌, ఈవోకు మాత్రమే అనుమతిచ్చారు. పాలకమండలి సభ్యులతో పాటు వీఐపీలకు మండపం బయట నుంచి వాహనసేవ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. గరుడసేవకు భక్తులు విశేషంగా వస్తారని, అందుకు తగిన విధంగా భద్రతతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసులు, విజిలెన్స్‌ అధికారులను ఆదేశించారు. గ్యాలరీల్లోని భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట భద్రత కల్పించాలన్నారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *