Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన ఇసుకు మాఫియా

శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన ఇసుకు మాఫియా

శ్రీకాకుళం జిల్లాలో ఇసుకు మాఫియా రెచ్చిపోయింది. రాత్రి సమయంలో నాగావళి నదిలో జరుగుతున్న అక్రమ దందాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై ఇసుక దొంగలు దాడి చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం, నైరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నైరా సమీపంలోని నాగావలి నదిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది. అక్కడికి వెళ్లారు. ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఎలా తరలిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన ఇసుకు మాఫియా కొందరు స్థానికుల సహకారంతో రెవెన్యూ సిబ్బందిపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన అధికారులు భయంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒకరి తలకు తీవ్ర గాయాలు అయితే మరో వీఆర్వో మధ్య వేళ్లు తెగిపోయాయి. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. గాయపడిన రెవెన్యూ సిబ్బందిని పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *