Breaking News
Home / Lifestyle / Business / ఈ బాత్రూం చెప్పుల ధర రూ. 72 వేలు.. అమెజాన్‌లో అదిరే ఆఫర్!

ఈ బాత్రూం చెప్పుల ధర రూ. 72 వేలు.. అమెజాన్‌లో అదిరే ఆఫర్!

న్యూఢిల్లీ: చెప్పులు ఎందుకు వేసుకుంటాం… ఇదేం ప్రశ్న? అని వింతగా చూడొద్దు. పాదాలకు రక్షణ కోసం. ఈ మధ్య రోగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చెప్పులను విక్రయిస్తున్నారు. డయాబెటిస్, బీపీతో బాధపడుతున్న వారి కోసమంటూ ఇందులోనూ రకాలున్నాయి. సైజు, నాణ్యతను బట్టి వంద రూపాయల నుంచి రెండుమూడు వేల వరకు ఉన్నాయి. అయితే, ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో విక్రయిస్తున్న ‘వెలెంటినో’ కంపెనీ హవాయి చెప్పుల ధర ఏకంగా రూ. 72,225.33. ఇంతా చేస్తే ఇవి ఇంట్లో వాడే బాత్రూం చెప్పులు మాత్రమే. విచిత్రం ఏమిటంటే నిన్నమొన్నటి వరకు వీటి ధర రూ.45,393 మాత్రమే. బహుశా డిమాండ్ పెరిగిందేమో.. ఇప్పుడు ఏకంగా ఏకంగా రూ.27 వేలు పెరిగింది. అది కూడా ఇప్పుడు ఒకే ఒక్క జత అందుబాటులో ఉంది. మరి ఇంత ధారపోసి కొంటున్నాం కాబట్టి వీటి నాణ్యత, ఉపయోగాలు గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కొనేముందు కొన్ని రివ్యూలు చూద్దామా?

‘‘మా ఆంటీ రికమెండ్ చేయడంతో ఈ చెప్పులు కొన్నా. ఇష్టంగా కొనుక్కున్న బైక్‌ను అమ్మేసి ఈ చెప్పులు కొనుక్కున్నందుకు నాకేం బాధగా లేదు. ఈ థర్డ్ క్లాస్ చెప్పులు అద్భుతంగా ఉన్నాయి. వీటితోనే నా గమ్యస్థానానికి చేరుకుంటున్నాను. బీపీ కంట్రోల్‌లోకి వచ్చింది. మధుమేహం నార్మల్ అయింది. దయచేసి ఈ చెప్పులు కొనుక్కోండి. ఆరోగ్యంగా ఉండండి. అవసరమైతే నా చెప్పులను రోజుకు రూ.500కు అద్దెకు ఇస్తా’’ అని ఒకరు వ్యంగ్యంగా రివ్యూ రాస్తే..

‘‘ఈ చెప్పులు కొనేందుకు నా మారుతి 800 కారు అమ్మేశా. ఎందుకంటే డ్రైవింగ్ చేయడం కంటే నడవడమే మంచిది. ఆరోగ్యం కూడా. డబ్బుకు తగ్గ ఉత్పత్తి’’ అని ఇంకొకరు రివ్యూలో పేర్కొన్నారు. ‘‘చాలా బాగున్నాయి. చాలా అరుదైనవి కూడా. అందుకే బయటకు వేసుకెళ్లడం లేదు. వాటిని తొడుక్కుని నిద్రపోతున్నా. ఆ తర్వాత లాకర్‌లో పెట్టేస్తున్నా’’ అని మరొకరు రాశారు. ‘‘మంచి ప్రొడక్ట్. చాలా చక్కగా ఉన్నాయి. అందుకనే నా కిడ్నీ అమ్మేసి వీటిని కొనుక్కున్నా’’ అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు. ఇంకో యూజర్ అయితే ఇలా రాసుకొచ్చాడు..

ఈ చెప్పులు చాలా బాగున్నాయి. వీటిని ధరించి ఎగిరిపోవచ్చు. డ్యాన్స్ చేయొచ్చు. నడవొచ్చు. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. దీనికి ఆటో పైలట్ మోడ్ కూడా ఉంది. చెప్పులు కొనడానికి ఇంతకుమించిన కారణం అవసరం లేదేమో. మీకు బోరు కొడితే చెప్పులు టెలివిజన్‌లా, మ్యూజిక్ ప్లేయర్‌లా మారిపోతాయి. మీకు భార్యో, గాళ్ ఫ్రెండో ఉండి, విడిపోవాలనుకుంటే వెంటనే ఈ చెప్పులను వారి పేరుపై క్యాష్ ఆన్ డెలివరీ కింద బుక్ చేయండి. ఇటీవల హుస్సేన్ బోల్ట్ ఫోన్ చేసి త్వరలో ఒలింపిక్స్ ఉన్నాయని, అద్దెకు వాటిని ఇవ్వాలని అడిగాడు. నేను ఇవ్వను పొమ్మన్నాను. రాహుల్ గాంధీ కనుక వీటిని తొడుక్కుంటే డ్యాన్స్‌తో అదరగొట్టేస్తారు.

ఎలా కొనాలంటే..
బ్యాంకు రుణం కోసం రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు అవసరం, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ కార్డుదారులూ అర్హులే. మీరు బాగా ధనవంతులైతే ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. వెర్షన్ 3 చెప్పులకు కిడ్నీ ఆప్షన్ కూడా ఉంటుంది. చెప్పులు కొనుగోలు చేసేముందు ధరను చెక్ చేసుకోండి.. డబ్బులు ఆదా చేసుకోండి.. అని రాసుకొచ్చాడు.

Check Also

తుంగ నదిలో చేపల మృతి…ప్రజల కలవరం

Share this on WhatsAppనది నీరు తాగకుండా తీరప్రాంత గ్రామాల ప్రజల భయాందోళనలు శివమొగ్గ : కర్ణాటక రాష్ట్రంలోని తుంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *