Breaking News
Home / National / సప్నా చౌదరి డ్యాన్స్ షోలో తొక్కిసలాట.. అభిమానులపై లాఠీ చార్జ్

సప్నా చౌదరి డ్యాన్స్ షోలో తొక్కిసలాట.. అభిమానులపై లాఠీ చార్జ్

న్యూఢిల్లీ: హరియాణాకు చెందిన సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తర భారతదేశంలో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె కార్యక్రమం ఉందంటే కుర్రకారు మత్తెక్కి పోతుంది. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

తాజాగా బుధవారం రాత్రి రాజ్‌గఢ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కూడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే, నిర్వహణ లోపాల కారణంగా షోలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇసుకేస్తే రాలనంతమంది జనం కార్యక్రమానికి హాజరయ్యారు. సప్న స్టేజీపైకి రాగానే సీట్లపై నుంచి ఒక్కసారిగా పైకిలేచిన అభిమానులు ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అభిమానులు గాయపడ్డారు.

దీంతో కల్పించుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించడంతో అభిమానులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అదే సమయంలో సప్నా చౌదరిని వేదికపై నుంచి పోలీసులు క్షేమంగా తరలించారు. కాగా, బిగ్‌బాస్ 11 పోటీదారు అయిన సప్నా చౌదరి గ్లామర్ ఇండస్ట్రీలో పాపులర్ అయింది. గతేడాది నవంబరులో బెగూసరాయ్‌లో నిర్వహించిన సప్న షోలోనూ గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

Check Also

ఢిల్లీ మాజీ సిఎం అంత్యక్రియల ఖర్చు ఎంతో తెలుసా?

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబాధ్‌ ఘాట్‌లో జరిగాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *