Breaking News
Home / Film News / ‘సరిగమప లిటిల్ చాంప్స్’ విజేత భావోద్వేగం…

‘సరిగమప లిటిల్ చాంప్స్’ విజేత భావోద్వేగం…

ఎనిమిదేళ్ల క్రితం ‘సరిగమప లిటిల్ చాంప్స్'(హిందీ)లో తన గానమాధుర్యంతో అందరినీ కట్టిపడేసిన అజ్మత్ హుస్సేన్‌కు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. అతను ఇండియన్ ఐడల్‌ వేదికపై ఆడిషన్ ఇచ్చేందుకు వచ్చాడని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా అజ్మత్ చెప్పిన సంగతులు విన్న అక్కడున్నవారు భావోద్వేగానికి లోనయ్యారు. 8 ఏళ్ల క్రితం అజ్మత్ హుస్సేన్ ‘సరిగమప లిటిల్ చాంప్స్’లో విజేతగా నిలిచి తన అద్భుత గాన మాధుర్యంతో అందరినీ మైమరపించాడు. అయితే ఈ విజయం తరువాత తన జీవితం ఎలా సాగిందో అజ్మత్ ఇండియన్ ఐడల్‌ వేదికపై వివరించాడు. తాను చెడు స్నేహాల బారిన పడి మత్తుమందులకు అలవాటు పడ్డానని, చివరికి పాటలు కూడా పాడటం మానేశానని చెప్పారు. ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితి హీనంగా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తప్పులను గ్రహించి వాటిని సరిదిద్దుకునేందుకు ఇండియన్ ఐడల్‌ వేదికపై ఆడిషన్ ఇచ్చేందుకు వచ్చానని తెలిపాడు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *