Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేటి నుంచే సర్కారీ మద్యం

నేటి నుంచే సర్కారీ మద్యం

8 గంటల వరకే విక్రయాలు.. షాపుల వద్ద నో డ్రింకింగ్‌
తొలిరోజు 3,330 షాపులు.. త్వరలో మరికొన్ని
సరుకు ఖాళీ చేసిన లైసెన్సీలు.. ‘ప్రైవేటు’కు తెర
అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు మద్యానికి తెరపడింది. నేటినుంచి సర్కారీ మద్యం అందుబాటులోకి రానుంది. కొన్ని దశాబ్దాలుగా ప్రైవేటు లైసెన్సీల చేతిలో ఉన్న మద్యం వ్యాపారం సంపూర్ణంగా ప్రభుత్వం చేతికొస్తోంది. అయితే మద్యం విక్రయాలు ఉదయం 11నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేయడం తాజా విశేషం. ప్రైవేటు మద్యం వ్యాపార విధానానికి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికింది. ప్రస్తుతం ఉన్న 4380 షాపులను సర్కారీ పాలసీలో 20శాతం కుదించి 3500కు పరిమితం చేసింది. అయితే సిబ్బంది కొరత, ఇతర కారణాల వల్ల తొలిరోజు 3,330 షాపులు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. మిగిలినవి వారం పది రోజుల్లో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అయితే పలుచోట్ల సిబ్బంది కొరత షాపులకు అవాంతరంగా మారింది. ప్రస్తుతం ప్రైవేటు షాపులు ఎలా ఉన్నాయో, ప్రభుత్వ షాపులు కూడా అలాగే ఉంటాయని, చిన్నచిన్న మార్పులు తప్ప పెద్దగా వ్యత్యాసం ఉండదని ఎక్సైజ్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ చెప్పారు. అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మరోవైపు నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 31 ఎక్సైజ్‌ చెక్‌పోస్టులను బలోపేతం చేస్తున్నామన్నారు. మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా చూస్తామన్నారు.

షాపులు ఖాళీ.. మద్యం కొరత
లైసెన్సు గడువు సోమవారం ముగియడంతో ప్రైవేటు లైసెన్సీలు షాపులన్నీ ఖాళీ చేశారు. సోమవారమే చాలా చోట్ల షాపులు మూసేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించిన ఎక్సైజ్‌ ఎక్కడా ఆలస్యం కాకుండా వెంటనే సరుకు షాపులకు తరలించింది. అలాగే కొత్త సిబ్బందికి సహకారం అందించేందుకు కొన్ని రోజుల పాటు ఇప్పుడు షాపుల్లో ఉంటున్న కానిస్టేబుళ్లను యథావిధిగా కొనసాగాలని అధికారులు ఆదేశించారు. ఇక, షాపుల వద్దే మద్యాన్ని సేవించే విధానాన్ని ఈ పాలసీలో ఎక్సైజ్‌ రద్దు చేసింది. మరోవైపు ఫ్రిడ్జ్‌లు కూడా లేకపోవడంతో బీర్లు చల్లగా తాగే అవకాశం లేదు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *