100 మంది దాకా దాఖలు చేసే అవకాశం
హుజూర్నగర్లో నామినేషన్లకు నేడే చివరిరోజు
హుజూర్నగర్: సర్పంచ్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా హుజూర్నగర్ ఉప ఎన్నికలో పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్న తెలంగాణ సర్పంచ్ల సంఘం సోమవారం చివరిరోజు వాటిని దాఖలు చేయనుంది. సుమారు 100 మంది సర్పంచ్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ధనలక్ష్మి ఆదివారం ఆర్వో కార్యాలయం నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, సర్పంచ్ల ఫోన్లను ట్యాప్ చేయడంతోపాటు మహిళ అని కూడా చూడకుండా తనను పోలీసులు అరెస్టు చేశారని ధనలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కచ్చితంగా నామినేషన్లు వేస్తామన్నారు. దీంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక.. నిజామాబాద్ లోక్సభ ఎన్నికలా మారనుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ పసుపు రైతులు పెద్ద సంఖ్యలో ఆ ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేయడం, అది జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించడం తెలిసిందే. కాగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్నయాదవ్తోపాటు పలువురు సర్పంచ్లను అరెస్టు చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన సహకారంతోనే సర్పంచ్లను విడుదల చేసినట్లు సమాచారం.
