Breaking News
Home / Film News / ‘శాటిలైట్‌ శంకర్‌’ మూవీ ట్రైలర్ విడుదల….

‘శాటిలైట్‌ శంకర్‌’ మూవీ ట్రైలర్ విడుదల….

ఫిల్మ్ న్యూస్: సూరజ్‌ పంచోలి కథానాయకుడిగా ఇర్ఫాన్‌ కమల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాటిలైట్‌ శంకర్‌’. మేఘా ఆకాశ్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘సాధారణంగా అంతరిక్షంలో ఉన్న శాటిలైట్‌ సంకేతాలను భూమికి పంపుతూ ఉంటుంది. అలాగే ఒక శాటిలైట్‌ భారత సరిహద్దుల్లో ఉంది. తన స్టైల్‌తో ఆ శాటిలైట్‌ ప్రజల్ని కలుపుతూ ఉంటుంది’ అంటూ శంకర్‌ పాత్ర గురించి చెబుతూ ట్రైలర్‌ ప్రారంభమైంది.

ఆర్మీలో పనిచేస్తున్న శంకర్‌ అనే యువకుడు సెలవుపై సొంతూరు పొల్లాచ్చికి వస్తాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడు? ఆర్మీ గొప్పదనాన్ని ఎలా చాటిచెప్పాడన్నది కథ. ‘ఒక దేశం ముక్కలయ్యేందుకు లక్ష కారణాలు ఉండవచ్చు.

కానీ, ఒక్క సైనికుడు మాత్రమే దాన్ని కలపగలడు’ చివరల్లో వినిపించిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. సినీ వన్‌ స్టూడియోస్‌ పతాకంపై మురాద్‌ ఖేతన్‌, అశ్విన్‌ వార్దేలు నిర్మిస్తున్నారు. ఇందులో సల్మాన్‌ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *