Breaking News
Home / National / ఇరాన్‌పై సౌదీ ప్రిన్స్ ఆరోపణలు….

ఇరాన్‌పై సౌదీ ప్రిన్స్ ఆరోపణలు….

సౌదీ అరేబియా : ప్రపంచదేశాలు ఇరాన్‌ను అడ్డుకోకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు అదుపులేకుండా పెరుగుతాయని సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ఇరాన్‌తో ఒకవేళ యుద్ధమే వస్తే, చమురు ధరలు చుక్కలనంటడం ఖాయమని దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని ప్రిన్స్ సల్మాన్ పేర్కొన్నారు. ఇటీవల సౌదీలోని ఆరామ్కో ఇంధన క్షేత్రాలపై డ్రోన్ల దాడి జరిగింది. ఆ దాడులకు ఇరాన్ కారణమని సౌదీ ఆరోపిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ప్రిన్స్ వార్నింగ్‌తో వచ్చేది ఏమీలేదని, అది కేవలం ఆ దేశానికి అవమానాన్ని మాత్రమే మిగులుస్తుందని ఇరాన్ పేర్కొన్నది. ఇటీవల హత్యకు గురైన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి ఘటనపై ప్రిన్స్ స్పందించి అతడిని హత్య చేయాలని తానేమీ ఆదేశించలేదని ఓ అమెరికా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *